తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమైన మరో నేత
- పాదయాత్రను చేపట్టబోతున్న మధు యాష్కి
- ఈ నెల 14 నుంచి 21 వరకు పాదయాత్ర
- 2,300 కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకుల పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన బండి సంజయ్, ఈటల రాజేందర్ పాదయాత్రలు చేశారు. ప్రస్తుతం వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు మరో తెలంగాణ నేత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మధు యాష్కీ అంత్యంత సన్నిహితుడు. తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,300 కిలోమీటర్ల ప్రజా చైనత్య యాత్రను చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకే పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. ఈ నెల 9వ తేదీ నుంచి డీసీసీ మండల, టౌన్ అధ్యక్షులకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.