'బింబిసార' సైలెంటైపోవడానికి కారణం ఏమిటి?
- చారిత్రక నేపథ్యంతో 'బింబిసార'
- ప్రధానమైన పాత్రలో కల్యాణ్ రామ్
- కొన్ని రోజులుగా లేని అప్ డేట్లు
- సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్
కల్యాణ్ రామ్ ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. హీరోగా ఆయన ఆ మధ్య చేసిన '118' తరువాత, మళ్లీ ఆ స్థాయి సక్సెస్ దొరకలేదు. ఇక నిర్మాతగా కూడా ఆయనకి భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలు చాలా తక్కువ. నిర్మాతగా భారీ సినిమాలతో సాహసాలు చేయవద్దని ఆ మధ్య ఎన్టీఆర్ ఆయనకి సలహా ఇచ్చినట్టుగా కూడా చెప్పుకున్నారు.
ఇక కొంతకాలం వరకూ ఆయన తాను హీరోగా చేసే సినిమాలను నిర్మించకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ, కొన్ని రోజుల క్రితం ఆయన 'బింబిసార' అనే భారీ చారిత్రక చిత్రాన్ని చాలావరకూ పూర్తి చేసుకుని వచ్చి, అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్దగా అనుభవం లేని దర్శకుడితో కల్యాణ్ రామ్ సాహసమే చేస్తున్నాడని అంతా చెప్పుకున్నారు.
ఇకపై వరుస అప్ డేట్లు ఉంటాయని అనుకున్నారు. కానీ మళ్లీ ఇంతవరకూ ప్రాజెక్టు నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆగిపోయిందని కొంతమంది అంటుంటే .. కొన్ని సీన్లు రీ షూట్లు చేస్తున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. సంయుక్త మీనన్ .. కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.