'ఖిలాడి' సాంగ్ కి 10 మిలియన్ వ్యూస్!

  • రవితేజ హీరోగా రానున్న 'ఖిలాడి'
  • కొన్ని రోజుల క్రితం వచ్చిన 'ఇష్టం' సాంగ్
  • దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాట
  • త్వరలోనే ప్రకటించనున్న రిలీజ్ డేట్
రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. ఈ సినిమాతోనే మీనాక్షి చౌదరి తెలుగు తెరకి పరిచయమవుతోంది.

పెన్ స్టూడియోస్ - ఎ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన 'ఇష్టం .. ' అనే లిరికల్ సాంగ్ కొన్ని రోజుల క్రితం వదిలారు. ఆ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసింది. దాంతో మేకర్స్ అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

భారీ బడ్జెట్ తో .. బలమైన తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది. అర్జున్ .. ముఖేశ్ రుషి .. సచిన్ కేడ్కర్ .. రావు రమేశ్ .. ఉన్నిముకుందన్ .. మురళీశర్మ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి విడుదల తేదీ ప్రకటన రానుంది.


More Telugu News