ఇద్దరు హీరోలు ఎంచుకున్న కథ ఒకటే .. టైటిల్సే వేరు!
- 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
- 'స్టూవర్ట్ పురం దొంగ'గా బెల్లంకొండ
- 70 - 80 దశకాలలోని గజదొంగ బయోపిక్ ఇది
- ఒకేసారి సెట్స్ పైకి వెళతున్న సినిమాలు
నిన్న దీపావళి రోజున ఒక గమ్మత్తు జరిగింది. ఒక వైపు నుంచి రవితేజ ' టైగర్ నాగేశ్వరరావు' పోస్టర్ .. మరో వైపు నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ 'స్టూవర్ట్ పురం దొంగ' పోస్టర్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది? పండగ సందర్భంగా వాళ్ల సినిమాల నుంచి అప్ డేట్ ఇచ్చారు .. అంతేగదా? అనుకోవచ్చు.
కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు .. ఈ రెండు సినిమాల కథ ఒకటే. హీరోలు .. దర్శకులు .. టైటిల్సు వేరు అంతే. 1970 - 80 దశకాలలో 'టైగర్ నాగేశ్వరరావు' అనే ఒక గజదొంగ ఉండేవాడు. ఆయన బయోపిక్ ఆధారంగానే ఇప్పుడు ఈ సినిమాలు రెండూ సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
అభిషేక్ పిక్చర్స్ వారి నిర్మాణంలో రవితేజ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో కేఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్నాడు. గతంలో ఇలా ఒకే కథతో వచ్చిన సినిమాలు లేకపోలేదు. మరి ఈ సారి ఏం జరుగుతుందనేది చూడాలి .
కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు .. ఈ రెండు సినిమాల కథ ఒకటే. హీరోలు .. దర్శకులు .. టైటిల్సు వేరు అంతే. 1970 - 80 దశకాలలో 'టైగర్ నాగేశ్వరరావు' అనే ఒక గజదొంగ ఉండేవాడు. ఆయన బయోపిక్ ఆధారంగానే ఇప్పుడు ఈ సినిమాలు రెండూ సెట్స్ పైకి వెళ్లనున్నాయి.
అభిషేక్ పిక్చర్స్ వారి నిర్మాణంలో రవితేజ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించనుండగా, బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో కేఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్నాడు. గతంలో ఇలా ఒకే కథతో వచ్చిన సినిమాలు లేకపోలేదు. మరి ఈ సారి ఏం జరుగుతుందనేది చూడాలి