ఆర్బీఐ నుంచి మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం
- సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన ఏపీ
- 7 శాతం వడ్డీరేటుతో రుణ సేకరణ
- కేంద్ర రుణ పరిమితిలో మిగిలి ఉన్నది రూ. 150 కోట్లు మాత్రమే
ఏపీ ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంది. ఆర్బీఐ వద్ద తమ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఏపీ వెయ్యి కోట్లను సేకరించింది. ఈ వేలంపాటలో ఐదు రాష్ట్రాలు పాల్గొన్నాయి. కాగా, ఏపీ ప్రభుత్వం అత్యధికంగా 7 శాతం వడ్డీని చెల్లించిమరీ రుణాన్ని సొంతం చేసుకుంది. ఈ తాజా అప్పుతో ఏపీకి కేంద్రం ఇచ్చిన రుణ పరిమితిలో మరో రూ. 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అదనపు రుణ పరిమితి కోసం ఏపీ ఆర్థికశాఖ మంత్రి, అధికారులు కేంద్రాన్ని కోరుతున్నారు.