ఒక్కో కుటుంబంపై జగన్ ప్రభుత్వ అప్పుల భారం రూ. 2.50 లక్షలు: కళా వెంకట్రావు 

  • రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేశారు
  • పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు భారం ఉంటుంది
  • ఆంధ్రప్రదేశ్ ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారు
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. గత రెండున్నరేళ్లలో ఏకంగా రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. ఒక్కో కుటుంబంపై ఇప్పటికే రూ. 2.50 లక్షల అప్పు భారం ఉందని అన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా జగన్ చేసిన అప్పుభారం ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారని దుయ్యబట్టారు.

సీఎం జగన్ దుబారా, మితిమీరిన అప్పులు, అవినీతి కారణంగా ప్రతి కుటుంబం అప్పుల భారాన్ని మోయాల్సిన పరిస్థితి తలెత్తిందని కళా వెంకట్రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ. 1,500గా ఉంటే జగన్ పాలనలో రూ. 5 వేలకు చేరుకుందని అన్నారు. మద్యం అమ్మకాలలో ఏడాదికి రూ. 5 వేల చొప్పున ఐదేళ్లలో జగన్ రూ. 25 వేల కోట్ల ముడుపులు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన జగన్... ఇప్పటి వరకు ఆరు సార్లు రేటు పెంచారని విమర్శించారు.


More Telugu News