రజనీ సినిమాలు చాలా టెన్షన్ పెట్టేవి: ఏఆర్ రెహ్మాన్

  • రజనీ సినిమాలపై అంచనాలు ఎక్కువ
  • మ్యూజిక్ పరంగా వాటిని అందుకోవడం కష్టం
  • నాకు సమయం తక్కువగా ఉండేది
  • దీపావళి అంటే టెన్షన్ పెరిగిపోయేదన్న రెహ్మాన్  
రజనీకాంత్ .. ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్లో వరుస సూపర్ హిట్లు వచ్చాయి. ఒకానొక సమయంలో తమిళనాట రెహ్మాన్ ప్రభ కొనసాగింది. ఆ సమయంలో టాప్ స్టార్స్ అంతా కూడా తమ సినిమాలకి ఆయనే పనిచేయాలని పట్టుబట్టేవారు .. అందుకోసం వెయిట్ చేసేవారు. అలాంటి స్టార్ హీరోలలో రజనీకాంత్ కూడా ఉండటం విశేషం.

ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రెహ్మాన్ స్పందించారు. రజనీకాంత్ గారి సినిమాలకు వరుసగా పనిచేశాను. సహజంగానే ఆయన సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. మ్యూజిక్ పరంగా ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. ఇక ఎప్పుడూ కూడా ఇతర ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నప్పుడు రజనీ సార్ సినిమాలు నాకు వచ్చేవి.

సాధారణంగా రజనీ సినిమాలు దీపావళికి ఎక్కువగా విడుదలయ్యేవి. ఆ సమయానికి నేను నా వర్క్ పూర్తి చేయవలసి ఉండేది. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చేవారు. దాంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని. దీపావళి వస్తుందంటేనే టెన్షన్ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News