తిరుపతి ఉప ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే కుట్రలు జరుగుతున్నాయి: ఎస్ఈసీకి టీడీపీ లేఖ

  • గతంలో వివిధ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ
  • వాటిని పూర్తిచేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తం
  • ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని అభ్యర్థన
ఏపీలో త్వరలో జరగనున్న పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దొంగనోట్లు వేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఎస్ఈసీకి టీడీపీ లేఖ రాసింది.  తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే మునిసిపల్ ఎన్నికల్లోనూ అమలు చేయాలని చూస్తోందని ఆ లేఖలో ఆరోపించింది. నకిలీ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది. దొంగ ఓట్లు వేయించేందుకు బయటి వ్యక్తులను రంగంలోకి దింపుతున్నారని ఆరోపించింది.

కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరింది. అంతేకాదని, ఓటమి భయంతో హింసాత్మక ఘటనలకు వైసీపీ కుట్ర చేస్తోందని, కాబట్టి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో అభ్యర్థించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో ఆగిపోయిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమైన నేపథ్యంలో టీడీపీ ఈ లేఖ రాసింది.


More Telugu News