ఆన్ లైన్ లో గంజాయి స్మగ్లింగ్.... విశాఖ లో స్టోర్ ఉద్యోగి అరెస్ట్
- అక్రమరవాణాకు అమెజాన్ ను ఉపయోగించుకుంటున్న స్మగ్లర్లు
- ఇటీవల గుట్టురట్టయిన వైనం
- మధ్యప్రదేశ్ లోని బెండీలో కేసు నమోదు
- విశాఖ కేంద్రంగా మధ్యప్రదేశ్ కు గంజాయి
- విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు
అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తున్న విషయం ఇటీవలే వెల్లడైంది. గంజాయి విశాఖ నుంచి మధ్యప్రదేశ్ కు వెళుతున్న వైనం కూడా బట్టబయలైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని బెండీలో కేసు నమోదు కాగా, మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖ చేరుకున్నారు.
విశాఖలో ఆన్ లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
విశాఖలో ఆన్ లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.