వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు?: జీవీఎల్
- ఏపీలో వరద బీభత్సం
- రాష్ట్ర ప్రభుత్వంపై జీవీఎల్ విమర్శలు
- ప్యాలెస్ నుంచే పాలన చేద్దామనుకుంటున్నారా అంటూ ఆగ్రహం
- ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏపీలో వరద బీభత్సం చోటుచేసుకున్న ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు పర్యటించలేదో చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. సీఎం వరద బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం సరికాదని విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లకుండా, కేవలం ప్యాలెస్ నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నారా? అని నిలదీశారు.
వరదల వల్ల రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీగా నష్టం జరిగిందని జీవీఎల్ వెల్లడించారు. ఇప్పటివరకు వరద బాధితులను పరామర్శించకపోవడం పట్ల సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ వరద సాయంపై కేంద్రానికి లేఖ రాశారని, కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుందని జీవీఎల్ విమర్శించారు.