'వీరమల్లు' నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న పవన్!

  • చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
  • 50 శాతం షూటింగు పూర్తి
  • తదుపరి షెడ్యూల్ వచ్చేనెలలో
  • కథానాయికగా నిధి అగర్వాల్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కొంతకాలం క్రితమే 'హరి హర వీరమల్లు' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ ఇది. ఎ.ఎం. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్లు వేశారు.

50 శాతం షూటింగు జరిగిన తరువాత కరోనా విరుచుపడింది. ఆ సమయంలో పవన్ కి కూడా కరోనా రావడంతో షూటింగు ఆపేశారు. అలా అప్పుడు ఆగిపోయిన షూటింగును తిరిగి ఇంతవరకూ మొదలుపెట్టలేదు. ఎందుకంటే ఈ లోగా 'భీమ్లా నాయక్' సినిమాను పూర్తిచేయాలని పవన్ అనుకోవడమే అందుకు కారణం.

ఇక ఇప్పుడు 'వీరమల్లు' తదుపరి షెడ్యూల్ కి పవన్ సిద్ధంగా ఉన్నాడు. వచ్చేనెలలో ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఇకపై నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అందుకు అవసరమైన కొత్త లొకేషన్ల ఎంపిక ప్రక్రియను కూడా క్రిష్ పూర్తి చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారు.


More Telugu News