ఆయా దేశాల నుంచి విమానాల రాకపోకలు నిషేధించాలి: విజయసాయిరెడ్డి
- కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలి
- దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ కు వెళ్లిన ఓ విమానం
- 61 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్
దక్షిణాఫ్రికాలో విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ కేసులు ఉన్న దేశాల నుంచి విమాన రాకపోకలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని అన్నారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే భారత్‌కు ప్రమాదమని ఆయన చెప్పారు.
దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ కు వెళ్లిన ఓ విమానంలో 61 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కరోనా టెస్టులు చేయాలని, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని ఆయన కేంద్ర సర్కారుకి సూచించారు.