ఉత్తరాంధ్రకు ఐఎండీ తాజా వర్ష సూచన

  • రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం
  • వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని వెల్లడి
  • డిసెంబరు 3 రాత్రి నుంచి ఉత్తరాంధ్ర, ఒడిశాపై ప్రభావం
దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని, ఆగ్నేయ-తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలపై ఉంటుందని తెలిపింది.

డిసెంబరు 3 రాత్రి నుంచి రెండ్రోజుల పాటు ఉత్తర కోస్తా, ఒడిశాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.


More Telugu News