వివేకానందరెడ్డి హత్యకేసు.. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐకి ఎదురుదెబ్బ
- వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గంగిరెడ్డి
- బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సీబీఐ
- మరో నిందితుడు సునీల్ యాదవ్ పిటిషన్పై 7న విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిలు పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి బెయిలు రద్దు చేయాలని కోరుతూ కడప కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై నిన్న వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీబీఐ పిటిషన్ను కొట్టివేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్పై విచారణను ఈ నెల ఏడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.
దీనిపై నిన్న వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీబీఐ పిటిషన్ను కొట్టివేసింది. ఇదే కేసులో మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్పై విచారణను ఈ నెల ఏడో తేదీకి కోర్టు వాయిదా వేసింది.