అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు.. లాక్ డౌన్ పై క్లారిటీ
- కాలిఫోర్నియా వ్యక్తిలో గుర్తింపు
- నవంబర్ 22న సౌతాఫ్రికా నుంచి రాక
- సోమవారం కరోనా.. ఇవాళ వేరియంట్ పాజిటివ్
- లాక్ డౌన్ పెట్టబోమన్న కాలిఫోర్నియా గవర్నర్
అమెరికాకూ ఒమిక్రాన్ పాకింది. సౌతాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు వచ్చిన వ్యక్తిలో కరోనా కొత్త వేరియంట్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అమెరికా సంక్రమిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఇవాళ శ్వేతసౌధంలో వెల్లడించారు. నవంబర్ 22న అతడు అమెరికాకు వచ్చాడని చెప్పారు. సోమవారం కరోనా పాజిటివ్ అని తేలగా.. జన్యు విశ్లేషణ ద్వారా అది ఒమిక్రాన్ అని ఇవాళ తేలిందన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మోడర్నా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు తెలిపారు.
ప్రజలంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఫౌచీ సూచించారు. బూస్టర్ షాట్స్ కూడా తీసుకోవాలన్నారు. టీకా తీసుకున్న వారికి ఈ కొత్త వేరియంట్ సోకినా.. వ్యాధి తీవ్రత, మరణపు ముప్పును వ్యాక్సిన్ తగ్గిస్తుందని చెప్పారు. కాబట్టి ఒమిక్రాన్ నుంచి కూడా వ్యాక్సిన్లు రక్షణనిస్తాయన్నారు. అందుకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో స్వల్ప లక్షణాలుండడమే నిదర్శనమని కాలిఫోర్నియా ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మార్క్ ఘాలీ అన్నారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తి క్లోజ్ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేశామని, వారికి కొవిడ్ నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. త్వరలోనే దీని నుంచి బయటపడతామని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ధీమా వ్యక్తం చేశారు. మరో లాక్ డౌన్ ను విధించబోమని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటిదాకా 23 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.