నేటి టెస్టు నుంచి సెలెక్టర్లు తప్పించిన ముగ్గురు టీమిండియా క్రికెటర్లు వీరే
- న్యూజిలాండ్‌తో కాసేపట్లో రెండవ టెస్టు
- అజింక్యా రహానే, జడేజా, ఇషాంత్ శర్మలకు రెస్ట్
- వారి ముగ్గురికీ ఇటీవల గాయాలు
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య కాసేపట్లో రెండవ టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 11.30 గంటలకు టాస్ వేయనున్నారు. ఈ మ్యాచులో టీమిండియా క్రికెటర్లు అజింక్యా రహానే, జడేజా, ఇషాంత్ శర్మలను తప్పించారు. ఇషాంత్ శర్మకు ఇటీవలే మ్యాచులో ఎడమ చేతి వేలికి గాయమైంది.
అలాగే, జడేజాకు కూడా కుడి చేతి మడిమకు గాయం కావడం, అజింక్యా రహానేకు తొడ కండరాలు పట్టేయడంతో వారి ముగ్గురినీ ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. వర్షం వల్ల టాస్ ఆలస్యంగా వేస్తున్నారు.
ప్రస్తుతం ముంబైలోని వాంఖడే స్టేడియం చిత్తడి చిత్తడిగా మారడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం వారు టాస్కు ఓకే చెప్పే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం వల్ల ఈ టెస్టుకు దూరం కావడంతో ఆ జట్టుకు టామ్ లాథమ్ సారథిగా వ్యవహరించనున్నాడు.