రేపు సూర్యగ్రహణం.. గ్రహణం ప్రారంభ, ముగింపు సమయాలు ఇవే!
- దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో కనిపించనున్న గ్రహణం
- భారత్ లో గ్రహణం కనపడదు
- ఉదయం 10.59 గంటల నుంచి మధ్యాహ్నం 3.07 గంటల వరకు గ్రహణం
రేపు (డిసెంబర్ 4) సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగుస్తుంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనపడుతుంది. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనపడదని నిపుణులు చెపుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య నాడు ఈ గ్రహణం వస్తోంది.
గ్రహణ సమయాలు: ఉదయం 10.59 గంటల నుంచి 12.30 గంటల వరకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ తర్వాత 01.03 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.07 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.
గ్రహణ సమయాలు: ఉదయం 10.59 గంటల నుంచి 12.30 గంటల వరకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ తర్వాత 01.03 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.07 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.