'భీమ్లా నాయక్' నుంచి అడివితల్లి మాట సాంగ్!

  • పవన్ నుంచి 'భీమ్లా నాయక్'
  • మూడు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • జనవరి 12న సినిమా రిలీజ్
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. పవన్ భర్త పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా సరసన నాయికగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి మూడు పాటలను వదలగా, మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫోర్త్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'కిందున్న మడుసులకా కోపాలు తెమలవు .. పైనున్న సామేమో కిమ్మని పలకడు. దూకేటి కత్తూలా కనికరమెరగవు .. అంటుకున్న అగ్గీలోనా ఆనవాలు మిగలవు' అంటూ ఈ పాట సాగింది. ఎమోషనల్ సీన్స్ పై కట్ చేసిన ఈ సాంగ్ జానపద బాణీలో సాగింది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను దుర్గవ్వ - సాహితీ చాగంటి ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, స్క్రీన్ ప్లే - సంభాషణలు త్రివిక్రమ్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈగో చుట్టూ అల్లుకున్న ఈ కథ ఇక్కడి ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. 


More Telugu News