గుజరాత్ లో ఒమిక్రాన్ కేసు... జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
- భారత్ లోనూ ఒమిక్రాన్
- ఇటీవల కర్ణాటకలో రెండు కేసులు
- తాజాగా జామ్ నగర్ లో ఓ వ్యక్తికి పాజిటివ్
- పూణే ల్యాబ్ లో నిర్ధారణ
భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించారు. అతడు ఆఫ్రికా దేశం జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చాడు. అతడి నుంచి నమూనాలు సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు.
అతడికి సోకింది ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అని నిర్ధారణ అయింది. దేశంలో ఇది మూడో ఒమిక్రాన్ కేసు. కొన్నిరోజుల కిందట కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడం తెలిసిందే.
అతడికి సోకింది ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అని నిర్ధారణ అయింది. దేశంలో ఇది మూడో ఒమిక్రాన్ కేసు. కొన్నిరోజుల కిందట కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడం తెలిసిందే.