చంద్రబాబు కావాలనే ఓటీఎస్ పై విషప్రచారం చేస్తున్నారు: సజ్జల
- గృహనిర్మాణ శాఖపై సజ్జల వీడియో కాన్ఫరెన్స్
- పేదల మేలు కోసమే ఓటీఎస్ అని వెల్లడి
- రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు లభిస్తుందన్న సజ్జల
- అపోహలు తొలగించాలని అధికారులకు స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గృహనిర్మాణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు మేలు కోసమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) అని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు కావాలనే ఓటీఎస్ పై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పథకంపై అపోహలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఓటీఎస్ ద్వారా గృహాల లబ్దిదారులకు మేలు జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు దొరుకుతుందని వివరించారు. ఈ పథకం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సజ్జల అధికారులకు నిర్దేశించారు.
ఓటీఎస్ ద్వారా గృహాల లబ్దిదారులకు మేలు జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు దొరుకుతుందని వివరించారు. ఈ పథకం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సజ్జల అధికారులకు నిర్దేశించారు.