తగ్గుతున్న వంట నూనె ధరలు.. నెల రోజుల్లో రూ. 10 తగ్గుదల
- మున్ముందు మరో రూ. 4 వరకు తగ్గే అవకాశం
- దేశీయంగా పెరిగిన నూనె గింజల దిగుబడులు
- ప్రపంచ మార్కెట్లో ధరల పతనం
గత ఏడాది కాలంగా వినియోగదారులను భయపెడుతున్న వంటనూనె ధరలు ఇటీవల కొంత తగ్గుముఖం పట్టగా, తాజాగా గత నెల రోజుల్లో మరో రూ. 8 నుంచి రూ. 10 వరకు తగ్గాయి. మున్ముందు మరో మూడు నుంచి నాలుగు రూపాయలు తగ్గే అవకాశం ఉందన్న వార్తలతో వినియోగదారుల్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది. దేశీయంగా నూనె గింజల దిగుబడులు పెరగడం, ప్రపంచ మార్కెట్లో ధరల పతనం వంటి వాటి కారణంగా వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దీపావళి సమయానికే వంట నూనె ధరలను తగ్గించాలని తమ సభ్యులందరినీ అసోసియేషన్ తరపున కోరినట్టు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అతుల్ చతుర్వేది తెలిపారు. కేంద్రం కూడా వంట నూనెలపై దిగుమతి చార్జీలను తగ్గించిందని పేర్కొన్నారు. ఫలితంగా ధరలు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది సోయాబీన్ ఉత్పత్తులు, వేరుశనగ పంటలు ఆశాజనకంగా ఉండడంతో మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.