కరీంనగర్ లో గాయకుడిగా మారిన దిల్ రాజు... వీడియో ఇదిగో!

  • కరీంనగర్ లో 'అమిగోస్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్ ప్రారంభం
  • హాజరైన మంత్రి గంగుల కమలాకర్, దిల్ రాజు
  • ఆర్కెస్ట్రాలో పాటలు పాడిన దిల్ రాజు
  • "హలో గురూ ప్రేమ కోసమేరోయ్..." అంటూ ఆలాపన
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గాయకుడిలా మారారు. కరీంనగర్ లో 'అమిగోస్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో ఆయన కూడా గొంతు కలిపారు.

నాగార్జున నటించిన 'నిర్ణయం' సినిమాలోని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అంటూ ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


More Telugu News