ఈ అంశమే తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్టింది: ఈట‌ల రాజేంద‌ర్

  • ప్ర‌త్యేక రాష్ట్రం కోస‌మే టీఆర్ఎస్ తో క‌లిసి ప‌నిచేశాను
  • క‌రోనా స‌మ‌యంలో ఆరోగ్య శాఖలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాను
  • ఇంతటి క‌రోనా సంక్షోభం ఉంటే న‌న్ను పార్టీలోంచి పంపించేశారు
  • క‌రోనా స‌మ‌యంలో న‌న్ను బ‌య‌ట‌కు పంప‌డం ఏంట‌ని చ‌ర్చ కొన‌సాగింది
బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ను తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ ఈ రోజు హైదరాబాదులో స‌న్మానించింది. అనంత‌రం ఆ యూనియ‌న్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న రాజ‌కీయ పార్టీతోనే సాధ్య‌మ‌ని టీఆర్ఎస్‌ను పెట్టారని, ప్ర‌త్యేక రాష్ట్రం కోస‌మే ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేశానని తెలిపారు.

తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో చోటు సాధించానని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. 2014లో రాష్ట్ర సాధించుకున్నామ‌ని, అనంత‌రం ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించానని గుర్తు చేశారు. త‌న‌ శ‌క్తి మేర‌కు ప‌నిచేశానని తెలిపారు. 2018లో మ‌ళ్లీ గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించానని, క‌రోనా స‌మ‌యంలో ఆరోగ్య శాఖలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశానని ఈటల రాజేంద‌ర్ అన్నారు.

'బాధ‌వేసిన అంశం ఏంటంటే. ఇంతటి క‌రోనా సంక్షోభం ఉంటే న‌న్ను అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు పంప‌డం ఏంట‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ కొన‌సాగింది. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాను. ఏ ఆత్మ ఆత్మ‌గౌరం కోస‌మైతే మేము పోరాడామో, తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం మొద‌లైందో ఆ ఆత్మ‌గౌరం దెబ్బ‌తింది' అని ఈట‌ల రాజేంద‌ర్ వివ‌రించారు. తెలంగాణ బిడ్డ‌ల ర‌క్తం క‌ళ్ల‌చూసిన వ్య‌క్తికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చార‌ని ఈట‌ల విమ‌ర్శించారు. హుజూరాబాద్ లో రూ.600 కోట్ల న‌ల్ల‌ధ‌నం ఖ‌ర్చుచేశార‌ని ఆయ‌న చెప్పారు.

'చాలా మంది నా ఆత్మ‌గౌరం మాత్ర‌మే దెబ్బ‌తింద‌ని అంటున్నారు. కేవ‌లం నా ఆత్మ‌గౌర‌వ‌మే కాదు. చాలా మంది ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింది. నేను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్తే మా బృందాన్ని లోప‌లికి రానివ్వ‌లేదు. చాలా బాధ‌ప‌డ్డాం. బానిస‌త్వం అనుభ‌విస్తున్నామ‌ని ఓ టీఆర్ఎస్ నేత కూడా అన్నారు' అని ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. అనంత‌రం అక్క‌డితో ఊరుకోకుండా త‌న‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించేశార‌ని, ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌దింద‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News