బండి సంజయ్‌తో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఈటల రాజేందర్
- ఆ ప్రచారం కేసీఆరే చేయిస్తున్నారు
- పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తా
- మద్యం ఆదాయం ప్రభుత్వానికి మంచిది కాదు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న ఈటల పలు అంశాలపై మాట్లాడారు. ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ. 600 కోట్లు ఖర్చు చేసిందని, ఆ సొమ్ము ఎక్కడిదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ కనుక ఆదేశిస్తే కేసీఆర్‌పైనా పోటీ చేస్తానని అన్నారు. తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానంటూ జరుగుతున్న ప్రచారం కేసీఆర్ చేయిస్తున్నదేనని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారని ఈటల అన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల కారణంగా ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని పేర్కొన్న ఈటల.. ఆడబిడ్డల తాళి బొట్లు తెగిపోతున్నాయని, మద్యం ఆదాయం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు.