విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకే: పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- నేడు ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబు
- ప్రైవేటీకరణతో పెట్టుబడులు వస్తాయని వెల్లడి
- మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరణ
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న తమ నిర్ణయంలో మార్పులేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదని కేంద్ర ఉక్కుశాఖ పార్లమెంటుకు వివరించింది. విశాఖ ఉక్కుపై ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ప్రైవేటీకరణతో ఉక్కు పరిశ్రమకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. ప్రైవేటీకరణ ద్వారా ప్లాంట్ విస్తరణకు అవకాశాలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించింది.