మేడారం జాతరకు రెడీ అవుతున్న తెలంగాణ ఆర్టీసీ.. 3,845 బస్సులను సిద్ధం చేస్తున్న అధికారులు

  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర
  • 21 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
  • ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు
  • హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు
తెలంగాణలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు వారి కోసం 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు.

ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు. బస్సులను నిలిపి ఉంచేందుకు 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. టికెట్ల క్యూ కోసం స్థలాన్ని చదును చేసే పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి.


More Telugu News