గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి పవన్ మాట్లాడాలి: సోము వీర్రాజు
- జగన్ నియంత మాదిరి పాలిస్తున్నారు
- ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలి
- రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న వీర్రాజు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేక విధానాలను జగన్ అవలంబిస్తున్నారని, నియంత మాదిరి పాలిస్తున్నారని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. 18 వేలకు అమ్ముతున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావించాలని కోరారు.