ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

  • దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల
  • రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
  • ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచన
  • పండుగ వేళ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్దేశం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. ఒమిక్రాన్ ముప్పు రాకముందే ఆంక్షల్ని అమలులోకి తీసుకురావాలని, కనీసం 14 రోజులు ఆంక్షలు అమలులో ఉండేలా చూడాలని వివరించింది.

రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని పేర్కొంది.


More Telugu News