ఆ సీన్స్ చేయడం తప్పుగా అనిపించలేదు: కృతి శెట్టి
- నాకు వాసు పాత్ర అంటే ఇష్టం
- ఆ సీన్ బాగా ఇబ్బంది పెట్టేసింది
- డిఫరెంట్ పాత్రలు చేయాలనుంది
- అలాంటి పాత్రలే ఒప్పుకుంటున్నానన్న కృతి
'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్' చేసింది. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి కృతి శెట్టి మాట్లాడుతూ .. 'శ్యామ్ సింగ రాయ్' - వాసు రెండు పాత్రలలో నాకు వాసు పాత్ర అంటేనే ఇష్టం.
ఈ సినిమాలో నేను సిగరెట్స్ తాగే సీన్ కూడా ఉంది. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఫస్టు డే వణికిపోయాను. ఇక నానితో కిస్ సీన్స్ గురించే అంతా అడుగుతున్నారు. ఆ సీన్స్ గురించి నేను అంత సీరియస్ గా ఆలోచించలేదు. కథకి అవసరం కనుకనే చేశాను. మిగతా సీన్స్ ఎలా బాగా రావాలని అనుకుంటామో .. ఇదీ అంతే అనుకున్నాను.
ఒకవేళ అవసరం అనిపించకపోతే మాత్రం నో చెప్పేదానిని. సందర్భానికి తగినట్టుగా ఉండటం వల్ల అది నాకు తప్పుగా అనిపించలేదు. రకరకాల పాత్రలను చేస్తుండటం వల్లనే ఏ పాత్రను ఎలా చేయాలనేది తెలుస్తుంది. అందువల్లనే కొత్తగా అనిపించిన పాత్రలను ఒప్పుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.