చలి కాచుకునేందుకు బైక్‌కు నిప్పు పెట్టిన దొంగ.. పోలీసుల షాక్!
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
- బైక్‌లను చోరీ చేసిన చోటా సర్ఫరాజ్ ముఠా
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- 9 బైకులు స్వాధీనం
చలి చంపేస్తున్న వేళ కాచుకునేందుకు చుట్టూ ఏమీ దొరక్కపోవడంతో చోరీ చేసిన బైక్‌కే నిప్పు పెట్టి చలికాచుకున్నాడో దొంగ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. విషయం తెలిసిన పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. వారి కథనం ప్రకారం.. స్థానిక యశోధరానగర్‌లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టిన బాధితులు వాహనాల చోరీపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోటా సర్ఫరాజ్, అతడి నలుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
వీరందరూ కలిసి 10 బైక్‌లను చోరీ చేసినట్టు విచారణలో వెల్లడైంది. వాటిలో 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పదో వాహనం కనిపించకపోవడంతో దాని గురించి ఆరా తీశారు. అప్పుడు దొంగ చెప్పిన విషయం విని పోలీసులు విస్తుపోయారు. చలి బాగా వేస్తుండడంతో తట్టుకోలేక బైక్‌కు మంటపెట్టి చలికాచుకున్నట్టు చెప్పాడు. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.