చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ హవా!

  • 14 సీట్లలో ఆప్ జయకేతనం
  • 12 స్థానాలలో గెలిచిన బీజేపీ  
  • ఇది మార్పుకు సంకేతమన్న కేజ్రీవాల్
ఢిల్లీ బయట కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాకిచ్చింది. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఆప్ జయకేతనం ఎగురవేసింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 35 స్థానాలు ఉండగా... అందులో 14 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది.

మరోవైపు గత ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 12 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో విజయం సాధించగా శిరోమణి అకాలీదళ్ ఒక్క స్థానంలో గెలిచింది. ఈ ఫలితాలతో ఆప్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మార్పుకు సంకేతమని చెప్పారు.






More Telugu News