దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్.. 653కు చేరిన ఒమిక్రాన్ కేసులు
- దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు
- రికవరీ రేటు 98.40 శాతం
- తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు
- ఆంధ్రప్రదేశ్‌లో 6 కేసుల నమోదు
దేశంలో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న కరోనా నుంచి 6,450 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 75,456 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రికవరీ రేటు 98.40గా ఉందని చెప్పింది.
మరోపక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 186 మంది కోలుకున్నారని వివరించింది. తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు కోలుకున్నారని పేర్కొంది.