ఇన్స్టాలో విజయ్ దేవరకొండ రికార్డ్!

  • 14 మిలియన్ కు చేరుకున్న ఫాలోయర్స్ సంఖ్య
  • అల్లు అర్జున్ తర్వాత రెండో స్థానంలో విజయ్
  • 2018లో ఇన్స్టా అకౌంట్ ప్రారంభించిన విజయ్
టాలీవుడ్ స్టైలిష్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో విజయ్ ను ఎంతో మంది ఫాలో అవుతుంటారు. బాలీవుడ్ అభిమానుల్లో సైతం విజయ్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కానున్న విజయ్ 'లైగర్' చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలావుంచితే, తాజాగా ఇన్స్టాగ్రామ్ లో విజయ్ సరికొత్త రికార్డును సాధించాడు. ఇన్స్టాలో విజయ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 14 మిలియన్ కు చేరుకుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తర్వాత అంతటి స్థాయిలో ఫాలోయర్స్ ను కలిగి ఉన్నది విజయ్ నే కావడం గమనార్హం. 2018 మార్చ్ లో విజయ్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశాడు. కేవలం మూడేళ్లలోనే విజయ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 14 మిలియన్లకు చేరుకుంది.


More Telugu News