దేశంలో మ‌రిన్ని పెరిగిన ఒమిక్రాన్ కేసులు

  • నిన్న దేశంలో 9,195 క‌రోనా కేసులు
  • ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781
  • తెలంగాణ‌లో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరు కేసుల నమోదు  
దేశంలో రోజువారీ క‌రోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. నిన్న దేశంలో 9,195 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. నిన్న 7,347 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని వివ‌రించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 77,002 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపింది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,51,292గా ఉంద‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 67.52 కోట్ల‌ క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం 143.15 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

ఇదిలావుంచితే, మరోపక్క, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781గా ఉంది. తెలంగాణ‌లో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరు ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా, ఒకరు కోలుకున్నారు.  

      


More Telugu News