కోట్లాది మంది వస్త్ర కార్మికుల జీవితాలను ఈ నిర్ణయం నాశనం చేస్తుంది: కేటీఆర్

  • వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను కేంద్రం ఉపసంహరించుకోవాలి
  • జీఎస్టీ పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది
  • రైతుల మాదిరే నేతన్నలు కూడా తిరగబడతారు
వస్త్ర పరిశ్రమపై జనవరి 1వ తేదీ నుంచి విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ పెంపు వల్ల వస్త్ర, చేనేత పరిశ్రమ కుదేలవుతుందని అన్నారు.

మన దేశంలో కోట్లాది మంది వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని... కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది వస్త్ర కార్మికుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను పెంపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ లో విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ కు ఆమె లేఖ రాశారు.

జీఎస్టీ పెంపు విషయంపై వస్త్ర పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని... వారి ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. జీఎస్టీ పెంపు విషయంపై కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే... రైతు చట్టాల విషయంలో రైతులు తిరగబడిన మాదిరే నేతన్నలు కూడా తిరగబడతారని అన్నారు. దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరపున తాము అండగా ఉంటామని చెప్పారు.


More Telugu News