జాక్వెలిన్ తో సహజీవనం.. అందుకే అన్ని గిఫ్ట్ లు: సుఖేశ్ చంద్రశేఖర్
- నేను కార్పొరేట్ లాబీయిస్ట్ ను
- వేలాది కోట్లు సంపాదిస్తాను
- మోసగాడిని కాదు
- న్యాయవాదికి వెల్లడించిన సుఖేశ్
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుఖేశ్ చంద్రశేఖర్ (32) మరికొన్ని తాజా విషయాలు బయటపెట్టాడు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న అతడు తీహార్ జైల్లో ఉన్న విషయం తెలుసు. అక్కడి నుంచే తన న్యాయవాదికి తాజాగా ఒక లేఖ రాశాడు. తనను మోసగాడిగా పేర్కొనవద్దని సూచించాడు.
‘‘నేను కార్పొరేట్ లాబీయిస్ట్ ను. దేశీయంగానూ, విదేశాల్లోనూ ఎన్నో కార్పొరేట్ సంస్థలకు పని చేశాను. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు, కంపెనీలకు మధ్య వారధిలా వ్యవహరించే వాడిని. 20 ఏళ్ల నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను. చాలా రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, వారి కుటుంబాలకు సన్నిహితుడిని’’ అని చెప్పాడు.
తాను లాబీయింగ్ చేస్తూ కమీషన్ రూపంలో వేలాది కోట్లు సంపాదించానని.. మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో సహజీవనం చేశానని.. అందుకనే అన్నేసి గిఫ్ట్ లు ఇచ్చినట్టు న్యాయవాదికి తెలిపాడు.
ఈడీ విచారణలో జాక్వెలిన్ కూడా సుఖేశ్ గురించి తనకు తెలిసిన వివరాలను లోగడ వెల్లడించింది. ‘‘2017 ఫిబ్రవరి నుంచి సుఖేశ్ నాకు పరిచయం. 2021 ఆగస్ట్ లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని కలిసింది లేదు. తాను సన్ టీవీ యజమానినని, జయలలిత కుటుంబానికి చెందిన రాజకీయ నాయకుడినని చెప్పాడు’’అని ఆమె వెల్లడించింది.