ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం.. తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు
- కరోనా+ఫ్లూ వైరస్ లు కలిపి డబుల్ ఇన్ ఫెక్షన్
- ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన మహిళలో గుర్తింపు
- మరికొందరిలోనూ ‘ఫ్లోరోనా’ ఉండి ఉంటుందన్న అధికారులు
ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ ఫెక్షన్ నే ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకినట్టు అధికారులు చెప్పారు.
ప్రస్తుతం ఈ కేసుపై అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ రెండు వైరస్ లు కలిస్తే జబ్బు తీవ్రత పెరుగుతుందా? అన్న దానిపై విశ్లేషిస్తున్నారు. మరికొందరు పేషెంట్లలోనూ ‘ఫ్లోరోనా’ మూలాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే శుక్రవారం నుంచి ఆ దేశ ప్రభుత్వం నాలుగో డోసు కరోనా వ్యాక్సిన్ ను రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వేస్తోంది. తద్వారా నాలుగో డోసు వేస్తున్న తొలి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది.