దూషించారంటూ మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు టీడీపీ కార్పొరేటర్ చంటి ధర్నా
- తన డివిజన్ పరిధిలో కార్యక్రమాలపై సమాచారం ఇవ్వలేదని ఆరోపణ
- ప్రొటోకాల్ పాటించట్లేదని వ్యాఖ్య
- కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందిచలేదని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు టీడీపీ కార్పొరేటర్ చంటి ధర్నాకు దిగారు. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో 52వ డివిజన్‌లో మంత్రి వెల్లంపల్లి పర్యటించారు. అయితే, తన డివిజన్ పరిధిలో కార్యక్రమాలపై కార్పొరేటర్‌నైన తనకు సమాచారం ఇవ్వలేదని చంటి ఆరోపణలు చేశారు.
ప్రొటోకాల్ పాటించట్లేదని అడిగితే మంత్రి దూషించారని ఆయన ఆరోపిస్తూ నిరసనకు దిగారు. దీనిపై తాము ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందిచలేదని చంటి చెప్పారు. మంత్రి ఇంటి ముందు ఉన్న రహదారిపై బైఠాయించి పలువురు మద్దతుదారులతో కలిసి టీడీపీ కార్పొరేటర్ చంటి నిరసన కొనసాగిస్తున్నారు.