పోలీస్ కమిషనర్ చివరకు ఓ కానిస్టేబుల్ మాదిరి ప్రవర్తించారు: ఈటల రాజేందర్
- బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరికాదు
- పోలీసులు చిల్లరగా ప్రవర్తించారు
- కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించారు
ఉపాధ్యాయులకు మేలు చేయాలనే డిమాండ్ తో దీక్షకు దిగిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరికాదని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు చిల్లరగా ప్రవర్తించారని విమర్శించారు. సాక్షాత్తు పోలీస్ కమిషనర్ కూడా చివరకు ఒక కానిస్టేబుల్ మాదిరి ప్రవర్తించారని మండిపడ్డారు. సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయ బదిలీలు గందరగోళంగా ఉన్నాయని ఈటల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల భర్త ఒక చోట, భార్య మరో చోట, పిల్లలు ఇంకో చోట ఉండాల్సి వస్తోందని చెప్పారు. కుటుంబాలు చెల్లాచెదురు అవుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీక్ష చేపట్టారని... అయినా అనుమతులు లేవంటూ ఆయనను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
సీఎం ఆదేశాలతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని... కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అన్ని పనులను సీపీనే చేశారని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టినా పర్లేదని, ఉపాధ్యాయులకు మాత్రం అన్యాయం చేయొద్దని ఈటల అన్నారు.