సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియాలో ఘోర పరాభవం

  • విమానాశ్రయంలో 8 గంటలపాటు నిలిచిపోయిన జకోవిచ్
  • వ్యాక్సినేషన్‌పై ఆధారాలు సమర్పించకపోవడంతో వీసా రద్దు
  • దేశం మొత్తం అతడి వెంటే ఉంటుందన్న సెర్బియా అధ్యక్షుడు
  • తమ దేశానికి ఎవరొచ్చినా నిబంధనలు పాటించాల్సిందేనన్న ఆసీస్ ప్రధాని
తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అయిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియాలో ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు  బుధవారం మెల్‌బోర్న్ చేరుకున్న జకోవిచ్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలు చూపించకపోవడంతో వీసాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జకోవిచ్ 8 గంటలపాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయాడు.

మరోపక్క, జకోవిచ్ వీసాను రద్దు చేయడంపై సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వ్యూకిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన జకోవిచ్‌ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. దేశం మొత్తం అతడికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వివాదంపై స్పందించిన ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్.. తమ దేశ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చినా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.


More Telugu News