'బంగార్రాజు' దూకుడు మూమూలుగా లేదే!
- సీనియర్ 'బంగార్రాజు'గా నాగ్
- జూనియర్ 'బంగార్రాజు'గా చైతూ
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
- సంక్రాంతికి భారీ విడుదల
నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' రూపొందింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగ్ సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు.
నిన్న ఈ సినిమా నుంచి 'బంగారా బంగారా బుల్లెటెక్కి వచ్చేయ్ రా' అనే లిరికల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. చైతూ - కృతి శెట్టిపై చిత్రీకరించిన ఈ పాట, అప్పుడే 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను కొల్లగొట్టేసింది. పూర్తి సాంగ్ ను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అనుకుని చాలా కాలమే అయినా, పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగిన నాగార్జున, చకచకా షూటింగు పూర్తయ్యేలా చూసుకున్నారు.
ఇక కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయన, ఈ సంక్రాంతికి తప్పకుండా ప్రేక్షకుల ముందుకు రావాలనే పట్టుదలతోనే ముందుకు వెళ్లారు. ఇక ఇప్పుడు బరి నుంచి 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' తప్పుకోవడం 'బంగార్రాజు'కి కలిసి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ కావడంతో, ఈ సినిమా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.