బండి సంజయ్ కి ప్రధాని మోదీ ఫోన్... ఇటీవలి పరిణామాలపై వాకబు
- ఇటీవల బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం
- అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన హైకోర్టు
- బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
- టీఆర్ఎస్ సర్కారుపై దాడి
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్, విడుదల తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇదే అదనుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాయి. ఇవాళ ఆయన బండి సంజయ్ తో స్వయంగా మాట్లాడారు. బండి సంజయ్ కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.