దేశంలో మరో 1.94 లక్షల మందికి కరోనా.. మరిన్ని పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- నిన్న 442 మంది మృతి
- యాక్టివ్ కేసులు 9,55,319
- మృతుల సంఖ్య మొత్తం 4,84,655
- ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. నిన్న దేశంలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారని వివరించింది. కరోనాతో కొత్తగా 442 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ఇక ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 9,55,319 మందికి చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,60,70,510కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,84,655గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు పెరిగింది.