మూడో టెస్టులో టీమిండియా ఓటమి... సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం
- కేప్ టౌన్ లో మూడో టెస్టు
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా
- 212 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించిన వైనం
- సిరీస్ 2-1తో చేజిక్కించుకున్న సఫారీలు
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. సొంతగడ్డ ఆధిక్యతను నిరూపించుకుంటూ దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాస్సీ వాన్ డర్ డుస్సెన్ 41, టెంబా బవుమా 32 పరుగులతో తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అంతకుముందు, యువ ఆటగాడు కీగాన్ పీటర్సన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడడం ఆటలో హైలైట్. పీటర్సన్ స్లిప్స్ లో ఇచ్చిన క్యాచ్ ను పుజారా జారవిడవడం ప్రతికూలంగా మారింది.
ఈ సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గిన తీరు చూస్తే, మిగతా టెస్టుల్లోనూ ఎదురుండదనిపించింది. అయితే, అనూహ్య రీతిలో దక్షిణాఫ్రికన్లు పుంజుకుని భారత్ పై ఎదురుదాడి చేశారు. వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్ విజేతగా అవతరించారు. అటు, దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు ఆశాభంగం తప్పలేదు.