వంతెనను పేల్చేసిన మావోయిస్టులు
- జార్ఖండ్‌లో ఘటన
- గిరిడి జిల్లా డుమ్రిలో విధ్వంసాలు
- సెల్‌టవర్లపై కూడా దాడులు
జార్ఖండ్‌లో మావోయిస్టులు వరుసగా దుశ్చర్యలకు పాల్పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు తెల్లవారుజామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి కలకలం రేపారు.
మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం 'రెసిస్టెన్స్ వీక్' పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలకు తెగబడుతున్నారు. మొదట ఖుఖ్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎయిర్‌టెల్ టవర్‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు, అనంతరం జైనుల యాత్రాస్థలం మధుబన్‌లోని ఐడియా టవర్‌ను పేల్చేశారని అధికారులు వివరించారు. మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వివరించారు.