రంగులు మార్చే బీఎండబ్ల్యూ కొత్త కారు... వీడియో ఇదిగో!
- ఆటో ఎక్స్ పోలో కొత్త కారు ప్రదర్శించిన బీఎండబ్ల్యూ
- ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కొత్త కారు
- ఈ లింక్ యాప్ ద్వారా రంగులు మార్చే వెసులుబాటు
జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇటీవల ఆటోమొబైల్ ఎక్స్ పోలో సరికొత్త కారును ప్రదర్శించింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే... ఒక్క బటన్ నొక్కితే చాలు రంగులు మార్చుకుంటుంది. ఇది విద్యుత్ ఆధారిత కారు. ఈ మోడల్ ను 'ఐఎక్స్ ఎం60'గా బీఎండబ్ల్యూ వర్గాలు పిలుస్తున్నాయి. 'ఈ లింక్' యాప్ ద్వారా ఈ కారు రంగులు మార్చవచ్చు.
కాగా, ఈ కారుకు సంబంధించి ఇతర వివరాలు ఏవీ వెల్లడి కాలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. తెల్లగా ఉన్న కారు కాస్తా ఉన్నట్టుండి గ్రే కలర్ లోకి మారిపోవడం చూడొచ్చు.
కాగా, ఈ కారుకు సంబంధించి ఇతర వివరాలు ఏవీ వెల్లడి కాలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. తెల్లగా ఉన్న కారు కాస్తా ఉన్నట్టుండి గ్రే కలర్ లోకి మారిపోవడం చూడొచ్చు.