విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు ‘పేటీఎం’ పరీక్ష!
- పెట్టుబడి కంటే తగ్గిపోయిన విలువ
- ఇటీవలే ముగిసిన ఐపీవో
- ఐపీవో ధరతో పోలిస్తే 58 శాతం చౌక
- దీర్ఘకాలంలో రాణిస్తే అది అందరికీ విజయమే
కాల పరీక్షకు నిలిచిన విఖ్యాత ఇన్వెస్టర్లలో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన్ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇన్వెస్టర్లు, ఫండ్ మేనేజర్లు అనుసరిస్తుంటారు. అయితే, అటువంటి ప్రసిద్ధ ఇన్వెస్టర్ కు భారత నూతన తరం కంపెనీ ‘పేటీఎం’ (వన్ 97 కమ్యూనికేషన్స్) ఇప్పుడు ఒక పరీక్షగా మారింది.
పేటీఎం ఇటీవలే ఐపీవో పూర్తి చేసుకుని స్టాక్ ఎక్సేంజ్ ల్లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా, 58 శాతం వరకు నష్టపోయి రూ.900 సమీపంలో ట్రేడ్ అవుతోంది. వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ హాతవే కూడా వన్97 కమ్యూనికేషన్స్ లో 2018లో పెట్టుబడులు పెట్టింది. నాడు 10 బిలియన్ డాలర్ల విలువ వద్ద కంపెనీ వ్యాల్యూషన్ ఉంది. ప్రస్తుత కంపెనీ విలువ రూ.60వేల కోట్లు (8 బిలియన్ డాలర్లు).
ఈ ప్రకారం వారెన్ బఫెట్ పెట్టుబడులు పెట్టి నాలుగేళ్లు గడిచిన తర్వాత కూడా నష్టంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా వారెన్ బఫెట్ విధానం సుదీర్ఘకాలంతో ముడిపడి ఉంటుంది. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అనుకోకుండా స్టాక్ ఎక్సేంజ్ మూతపడి పదేళ్ల అనంతరం తిరిగి తెరుచుకున్నా.. మన స్టాక్ నిలిచేదై ఉండాలంటారు బఫెట్. కనుక పేటీఎంలో నష్టం కనిపిస్తుందని విక్రయించి వెళ్లిపోయే రకం ఇన్వెస్టర్ కాదాయన.
కానీ, కంపెనీకి భవిష్యత్తు కష్టమేనని గుర్తిస్తే విక్రయించడానికి ఆయన ఒక్క రోజు కూడా ఆలస్యం చేయరు. కనుక బఫెట్ విషయంలో భారత కంపెనీ పేటీఎం కూడా ఒక పరీక్ష కానుంది. పేటీఎం తన వ్యాపార నమూనా విజయవంతమైనదిగా నిరూపించుకుంటే.. అది కంపెనీకి, ఇన్వెస్టర్లకూ విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుందని అనడంలో సందేహం లేదు.