కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టేంత వరకు ఉద్యమం జరుగుతుంది: రాధ రంగా రీఆర్గనైజేషన్ అధ్యక్షుడు 

  • కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టకపోవడం బాధాకరమన్న బాలాజీ
  • రంగాకు, వైయస్ కు మంచి బంధం ఉండేదని వ్యాఖ్య
  • విజయవాడలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తామన్న బాలాజీ
ఏపీలో కొత్త జిల్లాల అంశం పలు చోట్ల కాక రేపుతోంది. కొత్త జిల్లాలకు సంబంధించి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అన్ని సామాజికవర్గాల నాయకుడు రంగా అని... కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టకపోవడం బాధాకరమని రంగా రాధా రీఆర్గనైజేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ అన్నారు.

జిల్లాకు రంగా పేరు పెట్టాలని అందరూ ఐక్యంగా కోరుతున్నారని చెప్పారు. రంగాకు, వైయస్ కు మంచి బంధం ఉండేదని బాలాజీ గుర్తు చేశారు. జిల్లాకు రంగా పేరు పెట్టేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. విజయవాడలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తామని అన్నారు. టీబీకే అధ్యక్షుడు దాసరి రాము మాట్లాడుతూ, దామోదరం సంజీవయ్య, కన్నెగంటి హనుమంతు, రంగా పేర్లను ఆయా జిల్లాలకు పెట్టాలని డిమాండ్ చేశారు.


More Telugu News