‘బండి’ని భుజం తట్టి పలకరించిన మోదీ.. ఈటలకు అభినందన

  • ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ పలకరింపు
  • ‘చోటా ఆద్మీ బడా కామ్ కర్ రే’ అని ఈటలకు ప్రశంస
  • రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ బయలుదేరిన మోదీ
ఒక రోజు పర్యటన నిమిత్తం నిన్న హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. అలాగే, పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈటలను కూడా అభినందించారు. బండి సంజయ్ ప్రధాని మోదీకి ఈటలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన భుజం తట్టిన మోదీ.. ‘చోటా ఆద్మీ బడా కామ్ కర్‌ రే’ అని ప్రశంసించారు.

కాగా, రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ వీడ్కోలు పలికారు.


More Telugu News