విజయాన్ని సవాల్ గా తీసుకోండి.. వినూత్నంగా ఉండండి: సభ్యులకు రోహిత్ శర్మ సూచన

  • జట్టు కోసం ప్రతి ఒక్కరు పాటు పడాల్సిందే
  • మెరుగైన జట్టుగా తయారవుతాం
  • వెస్టిండీస్ పై మెరుగైన ప్రదర్శన
  • అందరి కృషితోనే విజయం
సభ్యులు వినూత్నంగా ప్రయత్నించాలని, తమకు తామే సవాలుగా తీసుకుని జట్టు విజయానికి కృషి చేయాలని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ఘన విజయం తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. భారత్ తన 1,000వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ను విజయంతో ముగించడం గమనార్హం.

‘‘జట్టుగా మేము మరింత మెరుగ్గా తయారవ్వాలని అనుకుంటున్నాం. తుది లక్ష్యం జట్టు కోరుకునే విజయాన్ని సాధించడమే. భిన్నంగా కృషి చేయాలని జట్టు కోరుకుంటుంటే ఆ పని చేయాల్సిందే. చాలా మారాలని అనుకోవద్దు. మీకు మీరే సవాలు చేసుకోండి. వినూత్నంగా ఉండండని నేను ఆటగాళ్లను కోరుతున్నాను’’అంటూ రోహిత్ శర్మ చెప్పాడు.

వెస్టిండీస్ తో మ్యాచులో భారత్ అన్ని విధాలుగా మెరుగైన ప్రదర్శన చేసినట్టు రోహిత్ పేర్కొన్నాడు. కాకపోతే లక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ‘‘నేను పరిపూర్ణమైన ఆట అనే దానిని నమ్మను. కచ్చితంగా ఉండడం అసాధ్యం. కాకపోతే మరింత మెరుగు పడాలి. మొత్తానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి కృషి జరిగింది. అందుకే తక్కువ వికెట్లకే లక్ష్యాన్ని పూర్తి చేయగలిగాము’’ అని రోహిత్ వివరించాడు.


More Telugu News